Thursday, January 23, 2025

ఎల్‌బి స్టేడియం ఆధునీకరిస్తాం: మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇక లాల్ బహదూర్ స్టేడియంను ఆధునీకరించనున్నారు. ఈ మేరకు స్టేడియం చుట్టూ నూతన ఫ్లడ్ లైట్స్‌తో పాటు క్రీడాకారుల హాస్టల్‌ను ఆధునీకరిస్తామని క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు వచ్చే 15 రోజుల్లో ఆధునీకరణ పనులు శర వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకు ఎల్ బి స్టేడియంలో క్రీడాశాఖ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మెన్ డాక్టర్ ఈ. ఆంజనేయ గౌడ్‌లతో కలిసి ఆయన స్టేడియంను పరిశీలించారు.

క్రీడాకారుల హాస్టల్‌ను ఆధునీకరణ చేయడంలో భాగంగా ప్రఖ్యాత లాల్ బహదూర్ స్టేడియంలో గ్రీనరీని కూడా పెంచాలని మంత్రి ఆదేశించారు. స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల టవర్స్‌ను ఆధునీకరించటానికి , అలాగే స్టేడియంకు కొత్తగా పేయింటింగ్ వేయడానికి అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్ బి స్టేడియం క్రీడాకారులకు కనీస క్రీడా సౌకర్యాలు మెరుగు పరచాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, అనురాధ, దీపక్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News