Friday, January 10, 2025

వాయుసేనకు మరో అస్త్రం

- Advertisement -
- Advertisement -

LCH will join Indian Air Force (IAF) on Monday

న్యూఢిల్లీ : పూర్తిగా స్వదేశీ నిర్మిత పోరాటపటిమల తేలికపాటి హెలికాప్టర్ (ఎల్‌సిహెచ్) సోమవారం భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)లో చేరనుంది. వాయుసేనలో చేరే దేశీయ హెలికాప్టర్ల క్రమంలో ఇది తొలి దఫా హెలికాప్టర్. ఈ ఎల్‌సిహెచ్ బహుళ స్థాయి వేదికగా ఉంటూ ఏకకాలంలో పలు మిస్సైళ్లను శత్రువుపై ప్రయోగించగలదు. ఇతర ఆయుధాలను కూడా గురి చూసి పంపించి లక్షాలను ఛేదిస్తుంది. ప్రభుత్వ అధీనపు ప్రధాన దేశీయ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) దీనిని రూపొందించింది. అత్యంత ఎతైన దుర్భేధ్య ప్రాంతాలలోకి చొచ్చుకుని వెళ్లే శక్తిసామర్థాలను ఇది సంతరించుకుని ఉంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో వాయుసేన దళంలోకి ఈ హెలికాప్టర్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సమక్షంలో ప్రవేశపెడుతారని వాయుసేన అధికారులు తెలిపారు. ఈ రెండు ఇంజిన్ల వాయుసారధి ఇప్పటికే పలు రకాల ఆయుధాల పరీక్షలలో తన సత్తా చాటుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News