Sunday, December 22, 2024

మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో ఎల్‌డిఎస్ ప్రతినిధి బృందం భేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల విదేశీ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ల్యాటర్స్ డిసెన్స్ సంస్థ (ఎల్‌డిఎస్) కోరం ఆఫ్ ది 12 ప్రెసిడెంట్ డిటర్ ఎఫ్ ఉక్ డార్క్, ఆసియా ఏరియా ప్రెసిడెంట్ జాన్సన్ , ఆసియా ఏరియా మేనేజర్ జాన్ గుట్టి, ఎల్‌డిఎస్ సభ్యులు జితేందర్, శంకర్ లూక్ సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సాంఘీక, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలకు సంబంధించి పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, వారికి అమలు చేస్తున్న కార్యక్రమాలను విదేశీ ప్రతినిధి బృందానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు.

ఇప్పటికే ధర్మపురి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించామని సభ్యులు చెప్పారు. తెలంగాణలో విద్య, వైద్య సేవలతో పాటు వ్యవసాయం, సాగునీటి రంగాల ప్రగతి, మైనారిటీల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎల్‌డిఎస్ సభ్యులు ప్రశంసించారు. తమవంతుగా ఆయా రంగాలకు మానవతా సహాయం అందజేస్తామని హామినిచ్చారు. ఈ నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు అమెరికాలో నిర్వహించనున్న రూట్స్ టెక్ ఎక్స్ పో 2023 లో తెలంగాణ ప్రభుత్వం తరఫున పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎల్‌డిఎస్ సభ్యులకు మంత్రి కొప్పుల మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News