Thursday, December 19, 2024

కెసిఆర్ వెంటే మేము

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి రోజురోజుకు జనాదరణ పెరుగుతున్నది. పార్టీ సిద్ధాంతాలు, సిఎం కె. చంద్రశేఖర్‌రావు పాలనపట్ల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు ఆకర్షితులై పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఈ మేరకు శనివారం ప్రగతి భవన్‌లో బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్‌తో మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎంపిలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబం ధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో పాటు రాష్ట్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను సిఎంను అడిగి తెలుసుకున్నారు.

బి ఆర్‌ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని ఆహ్వానించిన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు, దేశ రాజకీయాల్లో కెసిఆర్ వంటి ప్రత్యామ్నాయ ప్రగతి కాముక రాజకీయ నాయకత్వం నేడు ఎంతగానో అవసరం ఉందన్నారు. బిఆర్‌ఎస్ విధివిధానాల గు రించి వారు సుదీర్ఘంగా చర్చించారు. తాము పార్టీలో చేరడానికి తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు. కాగా సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన వారిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భార తి, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపి బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపి కుషాల్ భోప్చే, చత్తీస్‌గఢ్ సారంగద్ మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పసుల సమ్మయ్యపోచమ్మ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్, సిద్ధిపేట జిల్లా బిఆర్‌ఎస్ నాయకుడు అంబటి బాలచంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News