Monday, December 23, 2024

మంత్రి భట్టిని కలిసిన విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: డిప్యూటీ సిఎంగా, విద్యుత్‌శాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్కను విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని  వారు మంత్రికి విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు నక్కా యాదగిరి, కందూరి శ్రీనివాస్, నేమాని బెనర్జీ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News