Monday, January 20, 2025

హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్విందర్ సింగ్ సుక్కును కలిసిన కోహీర్ మండల నాయకులు

- Advertisement -
- Advertisement -

కోహీర్: నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు సందీప్ కుమార్ బృందం వేసవి కాలం విహారాయత్రకు హిమాచల్ ప్రదేశ్ రాజధాని ప్రాంతమైన సిమ్లా నగరానికి గత మూడు రోజుల క్రితం వెళ్లి మంచు ప్రాంతాల్లో సెదతిరుతున్న సోమవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు ఆకస్మిక పర్యటనకు రాగ సిఎంతో కోహీర్ పట్టణ బిఆర్‌ఎస్ నాయకులు సందీప్ కుమార్ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు వారితో ఇక్కడి వాతావరణాన్ని కోహీర్ పట్టణ కేంద్ర నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, సందీప్ కుమార్, దినకర్ నాగన్, శ్రీకాంత్ (స్టీఫెన్), తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News