Monday, January 20, 2025

ఇతర పార్టీల నేతల చూపు బిఆర్‌ఎస్ వైపే

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 20 సంవత్సరాలలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తన ఉనికిని విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. మరోవైపు దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దెశంతోనే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో తన ఉనికిని చాటు కుంటున్న ప్రయత్నాలలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి (బంటి) చేపట్టిన ప్రగతి నివేదన పాద యాత్రతో ఎన్నికలు తలపించేలా ప్రచారం మొదలు పెట్టారనే చర్చజోరుగా వినిపించింది. చివరి రోజు అంబర్‌పేటలో బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణతో ఐటి మంత్రి కెటిఆర్ బంటిని పొగడ్తలతో ముంచేత్తారు. ఓకా నొక దశలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికా లేక బంటికా ఎమ్మెల్యే అభ్యర్థి అంటు సోషల్ మీడియా ద్వారా దావానలంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందె.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గతం కన్న నేడు గులాబీ పార్టీ కంచుకోటగా మారిందనే చెప్పవచ్చు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధ్ది జరిగిన విషయం తెలుసుకున్న ఇతర పార్టీల నేతలు సైతం తమ స్వప్రయోజనాలు పరిష్కరం కావాలంటె ఎమ్మెల్యే , లేదా ఆయన తనయుడు చిటికెలో పరిష్కరిస్తున్నారని అనేక మంది ఇతర పార్టీల నేతలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పైగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎమ్మెల్యేతోపాటు బంటి కూడ చాపకింది నీరులా ఒక్కక్కరిని ఇతర పార్టీల నుండి వచ్చే విధంగా పోత్సహిస్తున్నారు.

దీంతో ఇతర పార్టీల నేతలు సైతం బిఆర్‌ఎస్ పెద్ద దిక్కు అంటు నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతందనడంలో సందేహాం లేదు. ఈ మధ్య బిఆర్‌ఎస్ ఓటు బ్యాంకు సైతం పెరిగిందని పార్టీ శ్రేణులు చెప్పుతున్నారు. ఇతర పార్టీలలో చెప్పుకోదగ్గ నాయకుడు నియోజకవర్గంలో లేకపోవడంతో ఆ పార్టీల నేతలు బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు సమాచారం . దీంతో కాంగ్రెస్ , బిజెపి నేతలలో గుబులు పట్టుకుంది.
నాలుగోసారీ గెలుపు దిశగా అడుగులు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాట్రీక్ సాధించారు.. మరోమారు గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేతల సర్వేలో , వాట్స్‌ప్ ,సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువ కావడంతో ఇతర పార్టీలలో ఉన్న నాయకులు సైతం గుబులు మొదలైంది. అంతేకాకుండా బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బంటి చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్రతో హుషారెక్కిన యువత , విధ్యార్థి నేతలు ఈనెల 5 నియోజకవర్గ కేంద్రంలో యువ సమ్మేళనం సభతో యువతలో నూతన ఉత్సహాం, విధ్యార్థులలో పట్టు సాధించి నాలుగవ సారీ గెలుపు కోసం బిఆర్‌ఎస్, యువజన విబాగం నేతలు కసరత్తు మొదలు పెట్టారు.
బిఆర్‌ఎస్‌పై పట్టు బిగిస్తున్న యువనేత బంటి : గత పదిహేను సంవత్సరాలుగా తండ్రి ఎమ్మెల్యేగా ఉండడంతో దాదాపు నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో బిఆర్‌ఎస్ యువ నేత బంటి అందరికి సుపరిచితులు అయ్యారు.దీంతో అన్ని గ్రామాలల నుండి ఆయన వద్దకు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య దళిత బందు, అన్ని కార్పొరేట్ స్కూళ్ళలో బంటి చెబితె ఫీజులు తగ్గుతాయని పార్టీల కతీతంగా బంటి వద్దకు వచ్చి పలానా కళాశాలలో ఫీజు తగ్గించాలని, రెవెన్యూ కార్యాలయంలో భూమి పరిష్కరించాలని ,పలానాల పోలీస్ స్టేషన్ చిన్న పంచాయితి ఉంది. దీని పరిష్కరించాలని బంటికి చెప్పడంతో ఆయన పార్టీలకతీతంగా చిటికెలో పరిష్కరిస్తున్నారు.దీంతో ఆయనను ప్రతి ఒక్కరూ అభి మానిస్తున్నారు.దీంతో యువతలో మంచిక్రేజి సంపాదించుకున్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళిన బంటి అభిమానులతో పాటు బిఆర్‌ఎస్ శ్రేణులు పార్టీల కతీతంగా సమావేశాలు చేసి బిఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధిపై చర్చించి ,ప్రభుత్వం చేసడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీలో చేర్పించే ప్రయత్నం చేస్తు నియోజకవర్గంపై పట్టు బిగిస్తున్నారు.
నాలుగోవ సారీ గెలిపించుకొని తీరుతాం … జెర్కోని రాజు
ముందస్తు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొని తీరుతామని నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు అన్నారు. గతంలోనే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచి హ్యాట్రీక్ సాధించారని మరోసారీ గెలుపించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు , రాష్ట్ర అభివృద్ధితోపాటు నియోజకవర్గం అభివృద్ధ్దిని ప్రజలు గమణిస్తున్నారని అన్నారు. దీనికి తోడు కళ్యాణ లక్ష్మీ, షాధిముభాకర్, రైతు బంధు, ఉచిత విద్యుత్ , దళిత బంధు ఒక రకంగా చెప్పాలంటె ఊరికి ఒక దేవుడు ఉన్న మాట వాస్తావమో ప్రతి ఇంట్లో కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకం అందని కుటుంబం లేదని అందుకే మరోసారీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని గెలిపించుకొని తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News