Saturday, November 16, 2024

బిసిలకు నాయకత్వం సమాజ్‌వాదీ పార్టీతో సాధ్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: భారత దేశంలో బిసిలకు నాయకత్వం వహించే పార్టీ, బిసిల భవిష్యత్తుకు ఉన్న ఏకైక పార్టీ సమాజ్‌వాదీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సింహాద్రి పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం లక్నోలో అఖిలేష్ యాదవ్‌ను కలిసి తెలంగాణ రాజకీయాలపై రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి మీరంతా కృషి చేయడమే కాకుండా బిసి ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని, కొందరు బిసిలకు న్యాయం చేస్తామని ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో నిర్మితమైన పార్టీ మొదటి నుండి ఓబీసీలు, అల్ప సంఖ్యాకులు, మహిళలు, దళిత గిరిజన వర్గాల కోసం ఎనలేని పోరాటాలను భారతదేశంలో చేసిన మొట్టమొదటి పార్టీ ఏకైక పార్టీగా ఆవిర్భవించిందన్నారు.

త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలపై పార్టీ ఆధ్వర్యంలో జరిపిన సర్వే నివేదికలను జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వివరించారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు ఈ చర్చలు ఎంతో ఉపయోగపడతాయని, చర్చించిన అంశాల పైన తెలంగాణలో దృష్టి పెట్టడమే కాకుండా భవిష్యత్తులో పార్టీపై నిబద్దతను ప్రదర్శిస్తూ రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని అఖిలేష్ యాదవ్‌కు తెలియజేశామన్నారు. త్వరలో ఏర్పాటు చేసే ములాయం సింగ్ యాదవ్ , బిపి మండల్ విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొంటారని, పార్టీ ఎజెండాను గ్రామ గ్రామాన తెలంగాణలో ప్రచారం చేయడమే కాకుండా వెనుకబడిన వర్గాలను, దళిత గిరిజన మరియు అల్పసంఖ్యాకులను చైతన్య పరచాలని దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. బిజెపి పాలన ఓబీసీలకు, దళితులకు, ముస్లింలకు వ్యతిరేకంగా పాలన జరుగుతుందని దానిని మనందరం మూకుమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబు గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News