- Advertisement -
హైదరాబాద్: ఇది లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ ప్రభుత్వమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంగళవారం బండి మీడియాతో మాట్లాడారు. గ్రూప్1తో సహా టిఎస్‌పిఎస్‌సి పరీక్షలన్నీ లీకయ్యాయని, లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్‌కు అత్యధిక మార్కులా? అని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యులను తొలిగించాలని డిమాండ్ చేశారు. రెండు నెలల్లో జరిగే పరీక్షల పేపర్లు కొందరికి లీకయ్యాయని, సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాని ఆరోపణలు చేశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై న్యాయ విచారణ జరిపాలని డిమాండ్ చేశారు.
- Advertisement -