న్యూఢిల్లీ : జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టిఎ) నిర్వహిస్తున్న పోటీ పరీక్షల పేపర్ల వరుస లీకేజీల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పరీక్షలను పారదర్శకంగా, సాఫీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ సారథ్యంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర వి ద్యా మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ఎన్‌టిఎ వ్యవస్థ, నిర్వహణ, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో మెరుగుదల, పరీక్షల ప్రక్రియ యంత్రాంగంలో సంస్కరణలపై ఏడుగురు సభ్యుల కమిటీ సి ఫార్సులు చేస్తుందని మంత్రిత్వశాఖలోని ఉన్నత విద్యా విభాగం తెలియజేసింది. కమిటీ రెండు నెలలలోగా తన నివేదికను సమర్పిస్తుందని ఆ విభా గం తెలిపింది.
కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) వైస్ చాన్స్‌లర్ బిజె రావు, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ఐఐటి మద్రాస్ ప్రొఫసర్ కె. రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకు డు పంకజ్ బన్సాల్, ఐఐటి ఢిల్లీ డీన్, ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి గో వింద్ జైశ్వాల్ ఉన్నారు. ఇటీవల నీట్, యుజిసి నెట్ పేపర్లు లీక్ కావడం, కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సంస్కరణల కోసం ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నా రు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పరీక్షల్లో లీక్‌లతో పాటు ఇతర అభ్యంతరకర చ ర్యలను నిరోధించేందుకు ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్’ను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకా రం చట్ట విరుద్ధంగా పరీక్ష పేపర్లను సంపాదించడం, లీకేజీ, జవాబులను ముందే తెలసుకోవడం లాంటి చర్యలకు పాల్పడితే బాధ్యులకు ఐదు నుం చి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.కోటి జరిమానా విధిస్తూ కఠినమైన చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది.