- Advertisement -
దక్షిణ కొరియాలో కార్చిచ్చు వ్యాపించి ఇప్పటివరకు దాదాపు 24 మంది మృతి చెందారు.మరో 24 మంది గాయపడ్డారు. శతాబ్దాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది. మంటలను ఆర్పడానికి వెళ్లిన హెలికాప్టర్ కూలిపోగా, అందులోని పైలట్ మృతి చెందారు. ఉయిసాంగ్ కౌంటీలో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో 1300 సంవత్సరాల నాటి పురాతన గౌన్సా దేవాలయం కాలిపోయింది. అయితే ఆలయం లోని కళాఖండాలతోపాటు అనేక విగ్రహాలను ముందే ఇతర దేవాలయాలకు తరలించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. కార్చిచ్చును ఆర్పేందుకు 10 వేల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు శ్రమిస్తున్నారు. కార్చిచ్చువల్ల బుధవారం నాటికి 43 వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇది అత్యంత ఘోరమైన ఆపదని, అపార నష్టం సంభవించిందని దక్షిణ కొరియా ప్రధాన మంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్ పేర్కొన్నారు.
- Advertisement -