Monday, December 23, 2024

బిజెపి, కాంగ్రెస్‌ను వీడి బిఆర్‌ఎస్‌లో పెద్దఎత్తున చేరిక

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్‌కు చెందిన బిజెపి మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఎస్.కె.హుస్సేన్, గాజులరామారం డివిజన్ బిజెపి మహిళా జనరల్ సెక్రటరీ ఎస్.సీతారా, జగద్గిరిగుట్ట 126 డివిజన్ సో మయ్య నగర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు డి.మల్లేష్, కె.ఈశ్వరమ్మ వారి బృందం 250మందితో కలిసి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో ఆయా పా ర్టీలను వీడి చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బిఆర్‌ఎస్ నాయకుడు ఆబిద్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించా రు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అ ధినాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే ఆదర్శవంతంగా దూసుకుపోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి తమ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పథకాలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అతితక్కువ కాలంలోనే అన్ని రం గాల్లో అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, ప్రభుత్వ పథకాలను పార్టీలో చేరిన కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కృషి చేసి రా బోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడోసారి గులాబీ జెండా ఎగురవేసేలా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News