Sunday, December 22, 2024

స్నానం చేస్తూ వీడియోలు పంపండి… విద్యార్థినులకు లెక్చరర్ వేధింపులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తప్పుడు దారిని పోయే విద్యార్థులను దండించి మంచి విషయాలు బోధించాల్సిన గురువు చెడుమార్గంలో ప్రయాణించాడు. ఓ లెక్చరర్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో మంచిగా ఉన్నట్టు కొన్ని రోజులు నటించాడు. విద్యార్థినుల ఫోన్ నంబర్లు తీసుకొని వారితో ఛాటింగ్ చేసేవాడు. ముగ్గురు విద్యార్థినులకు అసభ్య సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు. అన్నింటికీ తాను ఉన్నానని, చెప్పినట్లు ఒప్పుకోవాలని పలుమార్లు సెల్‌ఫోన్ మెసేజ్‌లు పంపేవాడు. ముగ్గురు విద్యార్థులకు ఫోన్ చేసి స్నానం చేస్తుండగా వీడియోలు పంపాలని బలవంతం చేశాడు. ముగ్గురు విద్యార్థినులలో ఒక విద్యార్థిని వీడియోలు పంపింది.

ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. తన కుటుంబ సభ్యులు, కాలేజీలో యజమాన్యానికి చెప్పుకోలేక సదరు విద్యార్థిని నరకం అనుభవించింది. సదరు లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. తన పరువు పోతుందని బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెనకంజ వేస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు పొందిన స్కూల్‌ను జూనియర్ కాలేజీగా మార్చారు. అప్పటి నుంచి కాలేజీలో విద్యార్థులు గంజాయికి బానిసగా మారారు. కాలేజీలోని కొందరు విద్యార్థులకు గంజాయి మత్తుకు అలవాటు పడడంతో రెండు మూడు సార్లు పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News