Thursday, January 23, 2025

ఆర్టికల్ 370పై వాదిస్తే… ఆ లెక్చరర్‌ను సస్పెండ్ చేశారా?: సుప్రీం ప్రశ్న

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నేరుగా వాదించిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వ లెక్చరర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జమ్ముకశ్మీర్‌లో రద్ద యిన ఆర్టికల్ 370 ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిసన్లపై సుప్రీం కోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్ విద్యా విభాగానికి చెందిన లెక్చరర్ జహూర్ అహ్మద్ భట్ కూడా ఈ రద్దును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమం లోనే ఆగస్టు 24న ఆయన విచారణకు హాజరయ్యారు. స్వయంగా లా డిగ్రీ పట్టా కలిగిన భట్, తన పిటిషన్‌పై తానే వాదనలు వినిపించుకున్నారు. అయితే ఇది జరిగిన మరుసటి రోజే భట్ విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈమేరకు ఆగస్టు 25న జమ్ముకశ్మీర్ విద్యా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో సోమవారం (ఆగస్టు 28) విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారో కనుక్కోవాలంటూ అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల తుషార్ మెహతాను ఆదేశించింది. వెంటనే జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. దీనికి ఎస్‌జీ తుషార్ మెహతా స్పందిస్తూ “ లెక్చరర్ సస్పెన్షన్ వెనుక పలు కారణాలు ఉన్నాయని తెలిపింది. ఆయన తరచూ విభిన్న కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ కోర్టుకు సమర్పిస్తాం” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News