మన తెలంగాణ/సిటీ బ్యూరో: వీధి దీపాలు ఎల్‌ఈడి వె లుగులను విరజుమ్ముతుండడంతో నగరమంతా కొత్త అందాలను సంతరించుకుంటోంది. గతంలో వీధి దీపాలంటనే బల్దియాకు గుదిబండగా మారిన పరిస్థితి. మో యలేని విద్యుత్ బిల్లుల భారం ఒకవైపు అంతా ఖర్చు చేసినా సరైన వెలుతురు సైతంలేకపోవడం సమస్యగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి 2016.17 సంవత్సరంలో నగరంలోని వీధీ దీపాలకు పూర్తిగా ఎల్‌ఈడి బల్బులను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో నగరంలో సరికొత్త వెలుగులతో ప్రత్యేక ఆకర్షణను సంతరించుకోవడమే కాకుండా ఘననీయంగా విద్యుత్ బిల్లు సైతం ఆదాకు నాంది పలికింది. 2016-.17లో చేపట్టిన ఈ ప్రక్రియను 20.20-21 ఆర్ధిక సంవత్సరంలో పూర్తి చేశారు. ఇందులోభాగంగా గ్రేటర్‌లో మొత్తం 4,54, 796 వీధి దీపాలకు ఎల్‌ఈడి బల్బులను అమార్చరు. అప్పటి నుంచి విద్యుత్ ఆదా కావడమే కాకుండా బి ల్లులు సైతం తగ్గుముఖం పట్టాయి. వీధి దీపాలకు ఎల్‌ఈడి బల్బులను అమర్చకు ముందు నెలవారిగా 20.17 మెగా యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా ఇందుకు సంబంధించి రూ.14.94 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చేది. ఎల్‌ఈడి ప్రక్రియ పూరైన తర్వాత నెలవారిగా వీధి దీపాలకు 9.96 మెగా యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుండగా రూ.8.5 కోట్లు మాత్రమే వస్తోంది. విద్యుత్ బిల్లు వస్తోంది.
240.80 మెగా వాట్ల నుంచి 118.85 మెగా యూనిట్లకు తగ్గిన విద్యుత్ వినియోగం
2016-17 ఆర్థిక సంవత్సరంలో వీధి దీపాల కు గాను 240.80 మెగా యూనిట్ విద్యుత్ వినియోగం కాగా ఇందుకు సంబంధించి బల్దియా విద్యుత్ బిల్లుల రూపంలో రూ.179.32 కోట్లను చెల్లించింది. ఎల్‌ఈడి ప్రక్రియ చేపట్టిన ఆ తర్వాత సంవత్సరం 217-18లో ఏకంగా 60 శాతం మేర విద్యుత్ వినిమోగం తగ్గింది. దీంతో 121.98 మెగా యూనిట్ల వినియోగం కాగా, రూ.96.19 కోట్లు విద్యుత్ బిల్లులు పడిపోయాయి. 2018-19 గాను 117.79 మెగా యూనిట్లకు గాను రూ.94.09 కోట్లు, 2019-20 సంవత్సరానికి గాను 118.85 మెగా యూనిట్లకు గాను రూ.94.79 కోట్లు విద్యుత్ బిల్లులను చెల్లించింది.
నగరంలో 4,92,997స్ట్రీట్ లైట్లు
జిహెచ్‌ఎంసి 150 డివజన్లతో జిహెచ్‌ఎంసి సుమారు 630 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించింది. ఈ మహా నగరంలో ప్రజల సౌకర్యార్థం 4,92,997 స్ట్రీట్ లైట్లను జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి 35.50 ఎండబ్లూ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. ఇందుకు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌కు చెందిన 2,52,.509 స్తంభాలు, జిహెచ్‌ఎంసి ఫోల్స్ 78,838, జిహెచ్‌ఎంసి మినీ హైమాస్ట్ 6,531 ఉ న్నాయి. వీటి నిర్వహణను సిసిఎంఎస్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు నగరంలోని వీధి దీపాలను సా యంత్రం వెలిగించి తెల్లవారు జామున నిలిపివేసేందుకు 28,034 స్వీచ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈవిధానంతో స్ట్రీట్ లైట్ల ఆన్ ఆఫ్ ప్రక్రియ సాఫీగా కొనసాగుతోంది.
ఎల్‌ఇడి వెలుగులతో విద్యుత్ బిల్లులు ఆదా
- Advertisement -
- Advertisement -
- Advertisement -