మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ వెన్నెముక సమస్యలకు స్పైనోకార్ట్ పేరుతో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టింది. శక్తివంతమైన పోషకాలతో కూడిన బయోలాజికల్ యాక్టివ్‌ల కలయికతో దీనిని అభివృద్ధి చేసింది. ‘ఇందులోని కొలాజెన్, గుడ్డు పెంకు నుంచి తీసిన పొర వెన్నెముక కీళ్లలో మృదులాస్థిని మెరుగుపరుస్తాయి. బోస్వెలియా సెరెటా ఎక్స్‌ట్రాక్ట్, ఎల్-లైసిన్ హైడ్రోక్లోరైడ్, కుర్కుమిన్, విటమిన్-సి, విటమిన్-డి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలున్నాయి. ఇవి ప్రధానంగా వెన్నెముక, ఇంటర్‌వెర్టెబ్రల్ డిస్క్‌పై యాంటీ ఇన్‌ఫ్లామేటరీగా పనిచేసి వాపును తగ్గించి, పరిస్థితులను మెరుగుపరుస్తాయి. ఈ ఔషధం వాడితే మూడు వారాల్లో నొప్పుల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుందని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. అన్ని మందుల షాపుల్లో, ఆన్‌లైన్‌లో అమెజాన్‌తోపాటు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లభిస్తాయి.
వెన్నెముక సమస్యలకు లీ హెల్త్ ఔషధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -