Wednesday, January 22, 2025

సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల గండ్లు

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయి. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రాపురం, రంగుల బ్రిడ్జి సమీపంలో రెండుచోట్ల ఆదివారం గండ్లు పడ్డాయి. రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా సాగర్ నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పాలేరు చెరువు నిండి వెనకకు నీరు తడ్డంతో గండ్లు పడివుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాలువకు రెండుచోట్ల సుమారు 20 మీటర్ల మేర గండ్లు పడ్డాయన్నారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎస్‌పి సన్ ప్రీత్ సింగ్, అడిసినల్ ఎస్‌పి నాగేశ్వరరావు, మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, తహశీల్దార్ సరిత, ఎంపిడిఓ ఇమామ్, ఎస్‌ఐ అజయ్ కుమార్, ఇరిగేషన్ డిఈ రఘు, ఎఈ సత్యనారాయణ ఆ ప్రదేశాన్ని పర్యవేక్షించారు. పైఅధికారులకు సమాచారమిచ్చి సాగర్ ఎడమకాలువ నీటిని నిలిపివేశారు.

కాగితరామచంద్రాపురం గామ సమీపంలో గండి పడటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. నీరు ఊరి మీదకు రాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే, వరద నీటి ప్రవాహం పంట పొలాలపై పడటంతో పంటలు పూర్తిగా మునిగిపోయాయి. సుమారు ఐదారు వందల ఎకరాలు పంట నష్టం జరిగి ఉంటుందని అన్నారు. మండల పరిధిలోని అన్నిగ్రామాల చెరువులు అలుగులు పోయడంతో కొన్నిచోట్ల రోడ్లు తెగి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు ఏళ్ళనాటి చెట్లు నేలమట్టమయ్యాయని అన్నారు. ఇంకా రెండు రోజులు వర్షాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. లోతట్లు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News