Tuesday, September 17, 2024

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీ గండి

- Advertisement -
- Advertisement -

నడిగూడెం: తెలంగాణలో భారీగా కురుస్తున్న వానకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి తోడు కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వరద పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు ఏడు క్యూసెక్కుల వరద వస్తోంది. దాంతో నీటిని సాగర్ జలాశయం నుంచి దిగువకు వదులుతున్నారు.

మూడు రోజులుగా కురుస్తున్న వాన కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ బాగా నాని భారీగా గండి పడింది. నడిగూడెం మండలం రామచంద్రపురం దగ్గర ఎడమ కాలువకు భారీ గండి పడిన విషయాన్ని అధికారులు గుర్తించారు. కాల్వకు రెండు చోట్ల 20 మీటర్ల గండి పడినట్లు అధికారులు నిర్ధారించారు. దాంతో వరద నీరు పంట పొల్లాల్లోకి ప్రవహిస్తోంది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.  అధికారులు గండి పడిన ప్రదేశానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గండి పడిన కారణంగా మాధవరం, సీత్ల తండా, మాగి తండ, రాజాపేట్ మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News