న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. నిరుద్యోగ సమస్యను ఆయన ‘మోడీ ప్రభుత్వ వారసత్వం’ అని వ్యాఖ్యానించారు. నిరుద్యోగంపై కాంగ్రెస్ నాయకులే కాదు ఇతర పార్టీ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
“ ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్రేడ్ ‘సి’ ఉద్యోగాలకు 37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నాక, 40వేల అగ్నివీర్ ఉద్యోగాలకు 35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిస్పృహతో ఉన్న యువత గళాన్ని ప్రభుత్వం వింటోందా? “మనం నిరాశతో ఉన్నాం, వేరే ప్రత్యామ్నాయం లేదు” అని మాజీ ఆర్థిక మంత్రి తన ఒకానొక ట్వీట్‌లో పేర్కొన్నారు.
“మోడీ ఎనిమిదేళ్ల పాలన తర్వాత మనకు దక్కింది, నిరుద్యోగం. ప్రస్తుతం నిరుద్యోగం రేటు 8 శాతం” అని ఆయన పేర్కొన్నారు. “సెప్టెంబర్ నెలవారీ సమీక్షలో ఆర్థిక మంత్రి నిరుద్యోగంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అన్నారు.
After 37 lakhs in Uttar Pradesh applying for Grade 'C' jobs, we have 35 lakh applicants for 40,000 Agniveer jobs
Is the government listening to the anguished voices of the young men: "we are desperate, we have no choice"
— P. Chidambaram (@PChidambaram_IN) October 29, 2022