Friday, November 15, 2024

కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే చట్టరీత్యా చర్యలు : పుడ్ సేప్టీ అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : కల్తీ ఆహార పదార్ధాలను విక్రయించినా, పరిశుభ్రతను పాటించకపోయినా చట్టరిత్యా చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ ప్రాంతాలలో వీధి వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పించారు.

ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, క్షేత్రస్థాయిలో వీధి వ్యాపారులు విక్రయిస్తున్న ఆహార పదార్థాలను పరీక్షించి, నాణ్యత,హైజీనిక్ గా ఉండడానికి కావలసిన సూచనలను చేశారు. నాణ్యత లో కల్తీ జరగకూడదని పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వాడోద్దని, కల్తీకి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సౌమ్య రెడ్డి, సర్కిల్ 23 నిహారిక, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News