Monday, December 23, 2024

బ్రిజ్ భూషణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • ఆమనగల్లులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

ఆమనగల్లు: మహిళా రేజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్న బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ చరణ్‌సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాంగ్ చేస్తూ మంగళవారం ఆమనగల్లు పట్టణంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జడ్పిటిసి అనురాధ పత్యా నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు.

స్థానిక బస్టాండ్ ఎదుట చేపట్టిన దీక్షను బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్‌తో కలిసి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి అనురాధ పత్యానాయక్ మాట్లాడుతూ బేటీ పడావో, బేటీ బచావో అనే నినాదం దేశ ప్రధాన మంత్రి పదే పదే చెబుతూ వస్తున్నా, ఆచరణలో మాత్రం శూన్యం అని అరోపించారు. దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహిళా రేజ్లర్లపై బిజెపి ఎంపి లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారం అన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసే వరకూ రెజ్లర్లకు మద్దతుగా ఆందోళనలు కొనసాగిస్తామని అనురాధ హెచ్చరించారు.

దీక్షకు పోలీసుల అనుమతులు లేవంటూ, పోలీసులు దీక్షను భగ్నం చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీక్షలో బిఆర్‌ఎస్ జిల్లా మహిళా నాయకురాలు చలికంటి ఆదిలక్ష్మీ, ఎంపిటిసి సరిత పంతునాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కమటం రాధమ్మ వెంకటయ్య, సర్పంచ్ కడారి మల్లమ్మ యాదయ్య, సోనా శ్రీనునాయక్, చుక్కమ్మ, కళ్యాణి, దోనాదుల కుమార్, సయ్యద్ ఖలీల్, రూపం వెంకట్‌రెడ్డి, చుక్క నిరంజన్ గౌడ్, రంజిత్, రమేష్ నాయక్, ఆనంద్, యాదయ్య, గణేష్ తదితులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News