Thursday, January 23, 2025

ప్రజావాణి ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : శాంతి భద్రతల పరిరక్షణలో భాగ ంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉం టూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై బాధితుల నుంచి వచ్చిన అర్జిలను జిల్లా ఎస్పి స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పి ప్రజావాణిలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్‌ల అధికారులతో మాట్లాడుతూ పోలీస్ పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడం లో బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పి ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అ లాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతల పరిస్థితులకు భంగం కలిగించే వారిపట్ల మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణానికి చెందిన స య్యద్ రాత్రి 8 గంటల సమయంలో ఎన్‌టిఆర్ లలిత తోరణం దగ్గర ఉండగా నాగమ్మ తండాకు చెందిన రాము నాయక్ అనే వ్యక్తి తనకు ఒక ఫోన్ చేసుకుంటానని చెప్పి ఫోన్ తీసుకుని మాట్లాడుకుంటూ అలాగే ఫోన్ ఎత్తుకుని వెళ్లిపోయారని, ఫోన్ తిరిగి ఇప్పించాలని ఎస్పికి విన్నవించగా ఎస్పి వనపర్తి సిఐని ఎంక్వైరీ చేసి ఫిర్యాదుదారునికి న్యాయం చేయాలని ఆదేశించా రు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 15 ఫిర్యాదులు రాగా అందులో భార్యభర్తలకు సంబంధించి 2 ఫిర్యాదులు, పరస్పర గొడవలకు సంబంధించి 2 ఫిర్యాదులు, భూ సమస్యలకు సంబంధించి 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News