Monday, December 23, 2024

‘సుప్రీం’లో తాడోపేడో

- Advertisement -
- Advertisement -

సాగునీటి ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేసి సగంలోనే వదిలేసిన సంస్థలపై సీరియస్

ఆర్‌ఇసి, పిఎఫ్‌సిల తీరు దారుణం అంటున్న అధికారులు ఇంకా రూ.24వేల కోట్లు ఇవ్వాల్సిన ఆర్థిక సంస్థలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను నిధులు ఇస్తామని ఒప్పం దాలు చేసుకొని ఇప్పుడు అకస్మాత్తుగా నిధులను ఇవ్వ కుండా నిలిపివేసిన ఆర్థ్ధిక సంస్థలపై న్యాయ పోరాటం చేసేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తులు చే స్తున్నారు. నాలుగేళ్ల క్రితం బ్యాంకులు, ఇతర ఆర్థ్ధిక సంస్థలతో రాష్ట్ర నీటి ఒప్పందాలు కు దుర్చుకొని ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలుపెట్టిందని, ఒప్పందాల మేరకు ఇప్పటివరకూ 70శాతం నిధులను వివిధ బ్యాంకులు, ఆర్థ్ధిక సంస్థలు రుణాలుగా ఇచ్చా యని నీటి శాఖలోని కొందరు సీనియర్ అధి కారులు వివరించారు. అంతేగాక గ్రామీణ విద్యుద్దీకర ణ సంస్థ (ఆర్‌ఇసి), పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పిఎఫ్ సి) వంటి సంస్థలుప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.30 వేల కోట్ల నిధులను అప్పుగా ఇస్తామని ఒప్పందాలు కుదుర్చుకొన్నాయని, ఒప్పందాల మేరకు రూ.6వేల కోట్లు రుణంగా ఇచ్చాయని వివరించారు. మరో రూ. 24 వేల కోట్ల వరకు ఈ రెండు ఆర్థ్ధిక సంస్థలు రుణాలు విడుదల చేయకుండా మొండికేస్తున్నాయని తెలిపారు.

అందుకే ఈ రెండు ఆర్థ్ధిక సంస్థలపై తాడోపేడో తేల్చు కోవాలని ఏర్పాట్లు చేస్తున్నామని ఆ అధికారులు వివ రించారు. ఆర్థ్ధిక సంస్థలు, బ్యాం కులతో కుదుర్చుకొన్న ఒప్పందాలు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులను కలుపుకొని మొత్తం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణా లకు 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలో రూ.29,197 కోట్ల నిధులను ఖర్చు చేయవచ్చునని అంచనా వేసుకొ ని ప్రభుత్వం బడ్జెట్‌లో కూడా భారీగా కేటాయింపులు జరిపింది. తీరా ఆర్థ్ధిక ప్రారంభమైన ఏప్రి ల్ నెల నుంచే ఈ సంస్థలు నిధులను విడుదల చేయకుండా నిలిపివేయడంతో ఇబ్బందులు మొదల య్యాయని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు, కాళేశ్వరం అదనపు టిఎంసి ఎత్తిపో తల నిర్మాణాలకు ఆర్‌ఇసి, పిఎఫ్‌సి సంస్థలు రూ.30 వేల కోట్లను రుణాలుగా ఇచ్చే విధంగా ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ నుంచి అయిదు ప్రాజెక్టుల నిర్మాణాలకు గానూ రూ.20వేల కోట్లను రుణాలుగా సేకరించాలని బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొన్నామని, ఈ నిధుల్లో సుమారు రూ.14 వేల 500 కోట్ల వరకు ఇచ్చారని, ఇంకా రూ.6వేల కోట్ల నిధులను నిలిపివేశారని తెలిపారు.

దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, శ్రీరాంసాగర్ వరద కాల్వ, తుపాకులగూడెం, సీతమ్మసాగర్ బ్యారేజీలకు ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా బ్యాంకులు, ఆర్థ్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. సీతారామ ఎత్తిపోతలకు రూ.8వేల కోట్ల రుణానికి ఆర్‌ఇసితో ఒప్పందం కుదిరిందని, ఇందులో రూ.5,500 కోట్లను విడుదల చేశారని, మరో రూ.2,500 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. సీతమ్మసాగర్‌కు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పిఎఫ్‌సి) సంస్థ రూ.3,400 కోట్ల రుణాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకుందని, ఇందులో రూ.400 కోట్లను ఇచ్చిన ఆ సంస్థ మరో రూ.3వేల కోట్లను విడుదల చేయకుండా నిలిపివేసిందని తెలిపారు. ఇలా బ్యాంకులు, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి వంటి ఆర్థ్ధిక సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. గడచిన మూడేళ్లల్లో కొన్ని లక్షల మంది కార్మికులు, వందలాది మంది ఇంజినీర్లు, ఏజెన్సీలు ప్రాజెక్టు సైట్లలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని పనులు చేస్తున్నాయని, వందలాది యంత్రాలు కూడా ప్రాజెక్టుల నిర్మాణాల్లో నిమగ్నమయ్యాయని, ఈ మొత్తం వ్యవస్థను ఈ ఆర్థ్ధిక సంస్థలు నాశనం చేశాయని, నమ్మించి మోసం చేశాయని ఆ అధికారులు మండిపడుతున్నారు.

నత్తనడకన 26 ప్రాజెక్టుల నిర్మాణాలు

ఆర్థిక సంస్థల నిర్వాకాల మూలంగా మొత్తం 26 ప్రాజెక్టుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అపారమైన నమ్మకం, విశ్వాసంతో కాంట్రాక్టర్లు ఇంకనూ ప్రాజెక్టుల నిర్మాణాలు సాగిస్తూనే ఉన్నారని, వేగం తగ్గినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆ అధికారులు వివరించారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఇస్తామన్న రుణాలు ఇవ్వకుండా నిలిపివేయడంతో ప్రాజెక్టుల నిర్మాణాలు మందగించడం, భూ పునరావాసం, బిల్లుల చెల్లింపులకు అవసరమైన నిధులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతోందని, అయినప్పటికీ ప్రభుత్వపెద్దలు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే పనులు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు.

కార్పోరేషన్ల పేరుతో సేకరించిన రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోకి తేవాలని కేంద్రం ప్రభుత్వ ఆర్థికశాఖ నిర్ణయించడంతో ఆర్థిక సంస్థలు రుణాలను నిలిపివేసినట్లుగా చెబుతున్నాయని, ఇది ఎంతవరకు న్యాయమో కోర్టులోనే తేల్చుకుంటామని నీటిపారుదల శాఖాధికారులు మండిపడుతున్నారు. రుణాలకు ఒప్పందాలు చేసుకొని పనులు ప్రారంభించిన తర్వాత నిధులను ఆపేస్తే ఆ ప్రభావం పనులపైన, బిల్లుల చెల్లింపులపైన పడుతుందని, బిల్లుల చెల్లింపుల్లో కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని అంటున్నారు. ఈ పరిస్థితులను కూడా మరింత సమగ్రంగా సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని కోరుతామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్టమైన విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్రం ఎన్ని విధాలుగా నష్టపోతుందో, ప్రజలు ఇంకెన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో కూడా సుప్రీంకోర్టుకు వివరిస్తామని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News