- మెదక్ ఎస్పి రోహిణి ప్రయదర్శిని
మెదక్: ప్రతి ఫిర్యాదుదారుల సమస్యలను చట్టపరంగా చర్యలు తీసుకుం టూ వాటిని పరిష్కరించాలని జిల్లా ఎస్పి రోహిణి ప్రయదర్శిని అధికారులకు సూచించారు. సోమవా రం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహి ంచిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన బాధితుల నుంచి ఆర్జీలను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎస్పి తెలిపారు. ఇందులో భాగంగా చిన్నశంకరంపేట మం డలం చందంపేట గ్రామానికి చెందిన కుమ్మరి రా ములు ప్రస్తుతం తాను ఓల్డ్ అల్వాల్‌లో నివాసం ఉంటున్నాని, తనకు చందంపేట గ్రామ శివారులో సూరారంకు వెళ్లే దారిలో సర్వే నెంబర్ 609/ అ/1/1, 609/అ/2/2 నందు మూడు ఎకరాల 9 గుంటల భూమి తన పేరుపై, మా తమ్ముడు కు మ్మరి స్వామిల పేర్లమీద రిజిస్టరం అయి ఉన్నాయని, ఈ భూమిలో మేటు నాట్లు వేస్తుండగా మా గ్రా మానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా చొరబడి వచ్చి నాట్లు వేస్తున్న మాతో పాటు మా మహిళలను ఇష్టం వచ్చినట్లు అనేక బూతు మాటలు తిట్టారని, మా చెల్లిని కొట్టి బురదలోకి మెడపట్టుకొని తో సేసారని, మీ అన్నను, తమ్ముడిని ఎక్కడ ఉన్నా చంపేస్తామని ఇట్టి వచ్చినట్లుగా తిడుతూ మమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వీరి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉం దని, కావున ఈ వారిపై చట్ట పరమైన చర్యలు తీ సుకొని మాకు న్యాయం చేయాలని కోరారు.
ఫిర్యాదుకు చట్ట ప్రకారం ఫిర్యాదుదారులకు తగిన న్యా యాలని చిన్నశంకరంపేట ఎస్‌ఐకి ఎస్పి సూచించారు. అదే విధంగా చేగుంట మ ండలం బోనాల గ్రామానికి చెందిన కిం గర్ల నాగయ్య, తనకు 279/త సర్వే నెం బర్‌లో ఒక ఎకరం భూమి ఉందని, అం దులో 50 సంవత్సరాల నుంచి వ్యవసా యం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని, కాగా గత జూలై 28వ తేదీన గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా నా భూమిలోకి ప్రవేశించి నాతో పాటు అక్కడే వరి నాట్లు వేస్తున్న కూలీలను బెదించి భూమి నాదే అని నా పొలంలో నాట్లు వేయకుండా మమ్మల్ని బెదించారు. ఈ సంఘటనపై వారి పట్ల మాకు ప్రాణ హాని ఉందని, కావున తమకు చట్టం ప్రకారం న్యాయం చేయాలని కోరారు. బాధితులకు చట్ట ప్రకారం తగిన న్యాయం చేయాలని రామాయంపేట ఎస్‌ఐకి ఎస్పీ సూచించారు. ఈ ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన పలు ఫిర్యాదుదారులు తమ ఆర్జీలను సమర్పించారు.