Friday, November 15, 2024

దేవేంద్ర ఫడ్నవీస్‌కు సమీర్ ఖాన్ లీగల్ నోటీస్!

- Advertisement -
- Advertisement -

Devendra Fednavis
ముంబయి: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మలిక్ అల్లుడు అయిన సమీర్ ఖాన్‌ను ఈ ఏడాది ఆరంభంలో డ్రగ్స్ సంబంధిత కేసులో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే సమీర్ తనను నిరాధారంగా డ్రగ్స్ కేసులో అరెస్టు చేసి మానసిక వ్యధకు, ఆర్థిక నష్టానికి గురిచేసినందుకుగాను బిజెపి నాయకుడు, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రూ. 5 కోట్లు నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీస్ పంపారు. ఆ లీగల్ నోటీసును మహారాష్ట్ర మంత్రి నవాబ్ మలిక్, ఆయన కూతురు నీలోఫర్ మలిక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ సమీర్ ఖాన్ నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకున్నట్లు ఫడ్నవీస్ ఆరోపించారు. “జనవరి 14న నా ఇంటిలో సోదాలు నిర్వహించినప్పుడు ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదని, కనీసం ఒక్క ఆరోపణకు సంబంధించిన ఆధారం కూడా లభించలేదని పంచనామాలో ఉంది”అని లీగల్ నోటీస్‌లో పేర్కొనడమేకాక పరువునష్టం నోటీసును కూడా జతచేసింది. కాగా ఆ లీగల్ నోటీస్ ఫడ్నవీస్‌కు తన కూతురు పంపిందని మంత్రి నవాబ్ మలిక్ పేర్కొన్నారు. ఆయన కూతురు నీలోఫర్ మలిక్ ఖాన్ ట్విటర్‌లో ఆ నోటీస్ ప్రతిని కూడా పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News