Friday, December 20, 2024

మండలంలో న్యాయ విజ్ఞాన సదస్సు

- Advertisement -
- Advertisement -

పెంబి : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సును మండల సేవ సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి జీతిన్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. శెట్‌పెల్లి, ఇటీక్యాల్, తాటిగూడ, కొసగుట్ట గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చట్టాల పై న్యాయమూర్తి జీతిన్ కుమార్ ప్రజలకు అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా జీతిన్ కుమార్ మాట్లాడుతూ అటవీ చట్టం వన్య ప్రాణుల సంరక్షణ చట్టం, ప్రాథమిక హక్కులు, విధుల గురించి తెలుపుతూ యువత గంజాయి సేవించకుండా సన్మార్గంలో నడవాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని,డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు.

గిరిజన ప్రజలు న్యాయపరంగా ఎలాంటి సహాయం కావాలన్న మండల న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని కోరారు. అలాగే సంబంధిత గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యలను ఆరా తీసి సంబంధిత సమస్యల పరిష్కారానికి అలా అధికారులకు తెలియజేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మంత్రరాజ్యం సురేష్, న్యాయవాదులు ఐదు వెంకటేష్, తులాల సురేంధర్, వెంకట మహేంద్ర, రాజ శేఖర్, శివ , రాజలింగం, పోలీస్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సుదర్శన్, మహేంధర్, తానాజీ రాజు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News