Saturday, November 23, 2024

కేంద్రం ముందు సలింగ వివాహాలు

- Advertisement -
- Advertisement -

ప్రాథమికంగా ఎవరికైనా తమ శరీరంపై ఇష్టం, మమకారం ఉంటుంది. యుక్త వయసునైతే అద్దానికి అతుక్కుపోయే వారెందరో! ఆడంగులు కూడా అందంగా తయారవడానికి కారణం అదే. వ్యక్తిగా అది అందరిలా వారికి కూడా వచ్చిన హక్కు. అయితే వారి అలంకరణ నవ్వులపాలవుతుంది. గేలి చేస్తూ ఆట పట్టించే వారికి బలవుతుంది. తన ఇష్టానుసారంగా బతకడానికి అడ్డంకిగా తయారవుతుంది. అప్పుడే తాను ఇలా ఎందుకు పుట్టాను అనే అంత వరకూ లేని ఆలోచన వారిని తొలిచి వేయడం మొదలవుతుంది. ఆత్మన్యూనతాభావం తలెత్తుతుంది. తన వయ్యారపు నడక, మృదువైన గొంతుక, అలవోక చూపులు తనకు శత్రువులుగా దాపురించాయని వేదన మొదలవుతుంది.

ఈ భూమ్మీద ప్రాణం పోసుకున్న ప్రతి జీవికి బతికే హక్కు ఉంటుంది. చెట్టు, చేమ, పక్షి, పశువు అన్నీ ఈ నేలపై హక్కుదారులే. మేధస్సు వృద్ధి చెందిన మనుషుల్లో మాత్రం సంఘ జీవనం పెరిగిన కొద్దీ రకరకాల వివక్షలు పుట్టుకొచ్చాయి. పేద ధనిక భేదాలు, కుల మత వైషమ్యాలు, లింగపర ఆధిపత్యాలు ఊడలమర్రిల్లా విస్తరించాయి. అంతిమంగా వాటి నీడనే మనుషులు బతికే తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

ఇన్ని వైరుధ్యాల్లో అల్పసంఖ్యకు పరిమితమైన థర్డ్ జెండర్ లింగ సమస్య కూడా విపరీతమైనదే. మనుషుల్లో లింగపరంగా ఆడ మగ యే కాకుండా అటు ఇటు కానీ అర్థ నరనారీ మానవులు కూడా ఉన్నారు. పైకి పురుషుల్లా ఉన్నా లోపలంతా ఆడతనమే ఉండేవాళ్ళు విపరీతమైన సంఘ తిరస్కారానికి గురవుతూ ఆడంగుల్లా బతుకుతున్నారు. ఆడవాళ్లలోనూ మగధీరుల్లా మాట, నడక ఇతర లక్షణాలు కలిగి శారీరకంగా అసంపూర్ణ స్త్రీత్వానికి కలిగినవారు ఉంటారు. అయితే మగవారు బయటికి రాక తప్పదు కాబట్టి లోకానికి ఇట్టే దొరికిపోతున్నారేమో అనుకోవాలి.

ప్రాథమికంగా ఎవరికైనా తమ శరీరంపై ఇష్టం, మమకారం ఉంటుంది. యుక్త వయసునైతే అద్దానికి అతుక్కుపోయే వారెందరో! ఆడంగులు కూడా అందంగా తయారవడానికి కారణం అదే. వ్యక్తిగా అది అందరిలా వారికి కూడా వచ్చిన హక్కు. అయితే వారి అలంకరణ నవ్వులపాలవుతుంది. గేలి చేస్తూ ఆట పట్టించే వారికి బలవుతుంది. తన ఇష్టానుసారంగా బతకడానికి అడ్డంకిగా తయారవుతుంది. అప్పుడే తాను ఇలా ఎందుకు పుట్టాను అనే అంత వరకూ లేని ఆలోచన వారిని తొలిచి వేయడం మొదలవుతుంది. ఆత్మన్యూనతాభావం తలెత్తుతుంది. తన వయ్యారపు నడక, మృదువైన గొంతుక, అలవోక చూపులు తనకు శత్రువులుగా దాపురించాయని వేదన మొదలవుతుంది.

సృష్టిలో మనుషులు మూడు రకాలు అందులో వారో రకం అని సమాజం సిద్ధపడితే ఆడంగులు కూడా ఆత్మాభిమానంతో బతికేయ గలరు. వారిని నలుగురిలో కలుపుకోకుండా, బడిలో చదువుకోనీయకుండా, పదుగురిలో పని చేసుకోనీయకుండా ఆటబొమ్మలా వాడుకొని వారిలో వారు కుమిలిపోయేలా చేశాం. భూమ్మీద చరాచర ప్రాణులు తరతరాలుగా కొనసాగడానికి భిన్న లింగ సంపర్కమే ప్రధానం. ఆడ మగల మధ్య సహజ లైంగిక ఆకర్షణే మానవ మనుగడ కొనసాగింపుకి మూలాధారం. ప్రపంచంలో ఆడ మగల మధ్య జరిగే పెళ్లి వల్ల శారీరక వాంఛ తీరడంతో పాటు తద్వారా జన్మించిన సంతానంతో వంశ వృద్ధి కూడా జరుగుతోంది. అయితే అటు ఇటు కాని వారు పిల్లల పుట్టుకకు పనికిరారు. వారితో కలయిక ఫలదీకరణ చెందదు.

వాస్తవంగా సంఘజీవిగా మనిషికి మరొకరి తోడు అవసరం. లైంగిక తృప్తికి భిన్నంగా మాట ముచ్చటకు, కష్ట సుఖాలు పంచుకునేందుకు తనవారు అనుకొనే మరొకరు జీవితాంతం కావలసిందే. పెళ్లి అనే తంతు కట్టుబాట్లతో కూడిన ఈ తోడును అందజేస్తోంది. ఆడ మగలు ఒకరికొకరు ఇలా జతకడితే మరి థర్డ్ జెండర్ మనుషులకు ఎవరు తోడుగా ఉండాలి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. వారు భిన్నజాతి ధ్రువాలు కానందున వారి లాంటి మరొకరు తోడుగా, వారిలో వారే ఒకరికొకరు జతగా ఉండాలనేదే సమాధానంగా దొరుకుతుంది. ఆడ మగ కలిసి ఉండడానికి పెళ్లి అవసరం. వారి కలయికను సమాజం అంగీకరిస్తుంది. మరి ఆడంగులు జీవితాంతం తోడు కోసం పెళ్లి చేసుకోవచ్చా? ఆడవారినో, మగవారినో వివాహం చేసుకోలేని దుస్థితిలో రాత్రి వేళ పక్కలో ఒక మనిషి కోసం పెళ్లి అనే బంధాన్ని వారు ఆశ్రయిస్తే తప్పేంటి? అలా ఏకమైనా వారి శారీరక వాంఛలెలా ఉంటాయి, వాటిని ఎలా తీర్చుకుంటారు అనేది పూర్తిగా వారి వ్యక్తిగతం. వారు కలిసి బతకాలని అనుకుంటున్నారు. అందరిలా వారికి కూడా చట్టబద్ధమైన వివాహ చట్ట రక్షణ అవసరం. విడిపోవాలంటే కోర్టు తీర్పుల ద్వారా విడాకులు మంజూరు కావాలి. వారిద్దరు మగవారా, ఆడవారా, ఇద్దరిలో ఎవరు భర్త, ఎవరు భార్య అనే లోతైన ప్రశ్నలు వేయకుండా ‘మేము ఇరువురం పెళ్లి చేసుకుంటాం. మాకు చట్టపర గుర్తింపు ఇవ్వండి!’ అని అడిగే ఎవరికైనా సగౌరవ సమాధానం ఇయ్యవలసిన బాధ్యత సమాజంపై ఉంది. పాలకులు, చట్టాలు తేల్చవలసిన అత్యవసర సమస్య ఇది.

నచ్చిన పురుషున్ని భర్తగా భావించి అతనితో గుట్టుగా తాళి కట్టించుకొని లోకం కంటపడకుండా సంసారం చేస్తున్న ఆడంగులు సమాజంలో ఉన్నారు. గుట్టు రట్టయ్యాక వారి దాంపత్య జీవితాన్ని సంఘ విద్రోహ చర్యగా పరిగణించి హింసించి, తరిమి కొడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. వారు ఒంటరిగా దొరికినపుడు గేలిచేయడం, జంటగా కనబడితే ఛీ అనడం సమాజ సభ్యత కాదు. అందరు ఆలుమగల్లలా వారు కూడా షాపింగ్ కి, సినిమాలకి, షికార్లకు వెళ్లే హక్కు వారికి దక్కాలి. సాధారణ వివాహాల్లా వీరి వివాహాలను కూడా పరిగణించేందుకు సమాజం సిద్ధపడడమే కాకుండా అందుకు అవసరమైన చట్ట సవరణలకు డిమాండ్ చేయాలి. రేపటి రోజుల్లో ఎవరి ఇంటి నుండైనా థర్డ్ జెండర్ మనిషి పుట్టుకు రావచ్చు.

ఇప్పుడే వారికి రక్షణ కవచాన్ని సిద్ధం చేయాలి. ఎటుకాని ఇద్దరు పెళ్లి ద్వారా జంటగా మారితే అదొక కుటుంబం అవుతుంది. వారికి పిల్లలను దత్తత తీసుకొనే హక్కు సంక్రమిస్తుంది. వారి ఆస్తికొక వారసత్వం, వృద్ధాప్యంలో ఆలనపాలనకు చేయూత లభిస్తాయి. ఇవన్నీ మన వివాహ చట్టాల్లో సవరణల వల్లే సాధ్యపడతాయి. అందుకే ఇలాంటి వివాహాలు చేసుకుంటున్నవారు గుర్తింపు, రక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మన చట్టాల్లో ఆ ప్రస్తావన లేనందున ఆ కేసులు ఎటు తేల్చలేక పెండింగులో ఉంటున్నాయి. ఒకే లింగానికి చెందిన ఇద్దరి వివాహానికి గుర్తింపు ఇవ్వకపోవడం, రాజ్యాంగంలోని అధికరణలు 14, 21ల ఉల్లంఘనయే అని ఒక జంట సుప్రీంకోర్టును న్యాయమడిగింది. దాం తో సుప్రీం నవంబర్ 25న కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి నాలుగు వారాల్లో దీనికి బదులివ్వాలని ఆదేశించింది.

ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల విషయానికొస్తే 21వ శతాబ్దంలో చాలా దేశాలు వివాహ చట్టాలను సవరించాయి. ఇప్పటికే 33 దేశాలు స్వలింగ వ్యక్తుల పెళ్లిని గుర్తించాయి. ఆ తర్వాత పిల్లలు లేని జంటగా వారికి దత్తత హక్కు కూడా సంక్రమించింది. తద్వారా వారు అనాథ పిల్లలకు తల్లిదండ్రులవుతున్నారు. దీని వల్ల సుదీర్ఘ సామాజిక దురభిప్రాయానికి పరిష్కారం దొరుకుతుంది. వివక్షకు గురవుతున్న మన తోటి వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ పెళ్ళిళ్ళను అంగీకరించిన దేశాల్లో ఇంగ్లాం డు, అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ లాంటి అగ్రరాజ్యాలున్నాయి. స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధం, మానసిక వైపరీత్యం అనే అభిప్రాయాలున్నా కొన్ని ఆధునిక శాస్త్రీయ అధ్యయనాలు మాత్రం ఇదంతా మానవ సహజ సాధారణ విధానమేనని మద్దతు పలుకుతున్నాయి. మన దేశంలో కూడా నలుగురిలో చిన్న చూపు కు గురవుతున్న థర్డ్ జెండర్ పౌరులకు కుటుంబ వ్యవస్థలో చోటు, వారికి గౌరవప్రదమైన సంసారిక జీవితం అందే సువర్ణావకాశం కేంద్రం తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News