Friday, December 20, 2024

ఆటో ఎక్కిన ఏఆర్ రెహ్మాన్!

- Advertisement -
- Advertisement -

లెజెండ్ మ్యూజీషియన్ ఏఆర్ రెహ్మాన్ దైవ భక్తుడు కూడా. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా తీరిక చేసుకుని దర్గాలను సందర్శించడం ఆయనకు అలవాటు. కడప సమీపంలోని ప్రముఖ అమీన్ పీర్ దర్గాను కూడా ఆయన తరచూ సందర్శిస్తూ ఉంటారు. తాజాగా శనివారంనాడు ఆయన తమిళనాడులోని నాగపట్టిణం వద్ద ఉన్న నాగోర్ దర్గాను దర్శించుకున్నారు. ఈ దర్గాలో జరుగుతున్న కండూరీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. దర్గాకు ఆయన ఆటోలో రావడం అందరినీ ఆశ్చర్యపరచింది.

మెరూన్ రంగు కుర్తా ధరించిన రెహ్మాన్ ఆటోలో వచ్చి, నేరుగా దర్గాలోకి వెళ్లారు. పద్నాలుగు రోజులపాటు జరిగే కండూరి వేడుకను నాగోర్ దర్గా వేడుకగా ప్రసిద్ధి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News