Sunday, February 2, 2025

పార్లమెంటులో రామాయణ్

- Advertisement -
- Advertisement -

పార్లమెంటులో ఫిబ్రవరి 15న జపనీస్ -ఇండియన్ యానిమేషన్ చిత్రం 1993 నాటి- రామాయణ్ – ద లెజెండ్ ఆప్ ప్రిన్స్ రామా- ను ప్రదర్శిస్తారు. చిత్రం పంపిణీ సంస్థ గ్రీక్ పిక్చర్స్ ఈ స్పెషల్ స్క్రీనింగ్ వివరాలను వెల్లడించింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు పార్లమెంటు సభ్యులు వివిధ సాంస్కతిక రంగాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు ఈ చిత్రాన్ని తిలకిస్తారు. రామాయణ్ చిత్రాన్ని భారత పార్లమెంటులో ప్రదర్శించే మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని, కృతజ్ఞతలు చెబుతున్నామని పంపిణి సంస్థ గీక్ పిక్చర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక స్థాయిలో తమకు ఈ గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు. రామాయణం భారతీయ మహోన్నత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు మహా కావ్యం అని, కొన్ని శతాబ్దాలుగా ఈ మహాకావ్యం ఎన్నో తరాలకు స్పూర్తిగా, మార్గదర్శిగా నిలుస్తోందని అర్జున్ అగర్వాల్ పేర్కొన్నారు.

రామాయణ – ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా చిత్రం భారతదేశంలో జనవరి 24న విడుదలైంది. ఈ చిత్రం ఇంగ్లీషు భాషలోనూ, హిందీ, తమిళం, తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. చిత్రానికి యూగో సాకో , రాం మోహన్, కొయ్ చి ససకీ దర్శకత్వం వహించారు. గతంలో టీవీలో రామాయణ్ చిత్రంలో నటించిన అరుణ్ గోయల్ ఈ చిత్రం హిందీ వర్షన్ లో రాముడికి డబ్బింగ్ చెప్పగా, సీత పాత్రకు నమ్రతా సహ్నాయ్, రావణడి పాత్రకు అమ్రేశ్ పురి గొంతు అరువు ఇచ్చారు. సీనియర్ నటుడు శతృఘన్ సిన్హా వ్యాఖ్యానం చేశారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన వి విజయేంద్ర ప్రసాద్ ఈ రామాయణ్ కొత్త వర్షన్ ను పర్యవేక్షించారు. ఈ రామాణయ్ యానిమేషన్ చిత్రాన్ని భారతదేశంలో 1993 లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించినా సినిమాహాళ్లలో విడుదల చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News