హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ లెజెండరీ, ఒలింపిక్ పత క విజేత తులసీదాస్ బలరాం(87) గురువారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రి చికిత్స పొందుతూ క న్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తులసీదాస్ మూత్రం, ఉదర సంబంధిత వ్యాదికి చికిత్స తీసుకుంటున్నారు. అంతర్జాతీయంగా భారత ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినధ్యం వహించిన తులసీదాస్ తెలంగాణ ముద్దు బిడ్డ. ఆయన 1936లో సికింద్రాబాద్ బొల్లా రాంలో జన్మించాడు. 1962లో జరిగిన ఏషియన్ పోటీల్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగిన బలరాం గోల్డ్ మెడల్ సాధించాడు.
దులసీదాస్ జాతీయ జట్టుకే కాకుండా హైదరాబాద్, బెంగాల్, ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన కెరీర్‌లో 1958లో ఈస్ట్ బెం గాల్ తరఫున బరిలోకి దిగిన బలరాం ఐఎఫ్‌ఎ షీల్డ్ కైవసం చేసుకున్నాడు. 1959 జరిగిన మెర్ఢెకా టోర్నమెంట్‌లో రన్నరప్ నిలిచాడు. ఆరుసార్లు సంతోష్ ట్రోఫీని అందుకున్న ఏకైక భారతీయుడిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కాడు. ఆయన ప్రతిభాను గుర్తించిన భారత ప్రభుత్వం 1962లో అర్జున అవార్డుతో సత్కరించింది.