Thursday, January 23, 2025

ప్రముఖ గాయని వాణీజయరాం ఇకలేరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ గాయని వాణీజయరాం శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. చెన్నైలోని తన నివాసంలో వాణీజయరాం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వాణీ జయరాంకు పద్మభూషణ్ ప్రకటించింది. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న ఆమె జన్మించారు. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలను వాణీజయరాం చక్కగా పాడేవారు.

వాణీజయరాం ఎనిమిదో ఏటనే సంగీత కచేరి నిర్వహించారు. మద్రాస్ క్వీన్స్ మేరీ కళాశాలలో పట్టా పుచ్చుకున్నారు. ఆమె పదేళ్ల వయస్సులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడారు. తొలిపాటకే తాన్ సేన్, మరో 4 అవార్డులు అందుకున్నారు. 14 భాషల్లో దాదాపు 8 వేలకుపైగా పాటలను వాణీజయరాం పాడారు. ఆమె మూడుసార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆమె మృతిపట్లు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News