Tuesday, March 25, 2025

డీలిమిటేషన్‌పై శాసనసభలో తీర్మానం?

- Advertisement -
- Advertisement -

నేడు గ్రాంట్ల అభ్యర్ధనలపై సిఎం ప్రతిపాదనలు
* శాసనసభలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు

మన తెలంగాణ / హైదరాబాద్ : నియోజకవర్గాల పునర్విభజన విధానంపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ఆందోళన చేస్తున్న నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం సోమవారం డీ లిమిటేషన్‌పై తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ ఇటీవల చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఇరు పార్టీల నేతలు హాజరై తమ గళం వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో డీ లిమిటేషన్ పై ప్రవేశపెట్టనున్న తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించనున్నట్లు సమాచారం. కాగా శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం ఎనిమిదవ రోజు 2025 26 సంవత్సరానికి గ్రాంట్ల కొరకు అభ్యర్ధనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నారు.

పురపాలన, పట్టణాభివృద్ధి కింద రూ. 16436,69,65,000 మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని కోరనున్నారు. అలాగే సాంఘీక సంక్షేమం కింద రూ. 35694,29,95,000 సొమ్ము, గిరిజన సంక్షేమం కింద రూ. 15177,96,06,000 సొమ్ము, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కింద రూ.3590,77,83,000 సొమ్ము మంజూరు చేయాలని ప్రతిపాదిస్తారు. ఐటి,పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరిశ్రమలు, వాణిజ్యం కింద రూ.2477,19,60,000 సొమ్ము, సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల కింద రూ.774,15,69,000 సొమ్ము మంజూరు చేయాలని మంత్రి ప్రతిపాదిస్తారు.

అలాగే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ కింద రూ. 10333,12,96,000 మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని ప్రతిపాదిస్తారు. అలాగే గ్రామీణాభివృద్ధి కింద రూ. 13741,43,000, మహిళా శిశు, వికలాంగుల సంక్షేమం కింద రూ. 2792,07,09,000 సొమ్ము ప్రభుత్వానికి మంజూరు చేయాలని ప్రతిపాదిస్తారు. రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెనుకబడిన తరగతుల సంక్షేమం కింద రూ. 11405,31,12,000 మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని ప్రతిపాదిస్తారు. అనంతరం 2025 తెలంగాణ పురపాలక సంఘాల (సవరణ) బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తారు. అలాగే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో పాటు) మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క దనసరి తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ప్రతిపాదిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News