Thursday, January 23, 2025

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

- Advertisement -
- Advertisement -

Leharaayi movie

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘లెహరాయి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్దమైన సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు విజయ్ కుమార్ కొండా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ “ఈ చిత్ర దర్శకుడు రామకృష్ణ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా నుంచి నాతో ప్రయాణిస్తున్నాడు.

ఇప్పుడు తను చేస్తున్న ఈ సినిమాకు ‘లెహరాయి’ అని మంచి టైటిల్ పెట్టాడు. మంచి కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు”అని అన్నారు. చిత్ర సమర్పకుడు బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ “ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా. ఈ చిత్రం నాకు బాగా నచ్చడంతో కథకు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయించడంతో ఈ రోజు పర్ఫెక్ట్ మూవీని ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాం”అని చెప్పారు. చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ “లెహరాయి అంటే అల అని అర్థం.

సముద్రపు అలల్లాగా జీవితంలో ఒడిదుడుకులు కూడా ఉంటాయి. మోషన్ పోస్టర్‌లో రెండు పక్షులు తమ రెక్కలు ఎగురేసుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అదేవిధంగా లెహరాయి సినిమాలో కూడా హీరోయిన్ ప్రేమ ఒక వైపు ఉంటే గోల్ మరో వైపు… ఈ రెండిటి మధ్యన ఉన్న సంఘర్షణను తను ఎలా ఎదుర్కొన్నదనేది ‘లెహరాయి’ సినిమా”అని తెలిపారు. చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మిళితమైన ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో రంజిత్, మ్యూజిక్ డైరెక్టర్ జి.కె, సుప్రీం రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News