Monday, December 23, 2024

డచ్ గ్రీన్‌హౌస్ డెల్టాతో లెమన్ చిల్లీ ఫార్మ్స్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

ర్యావరణ అనుకూల హైడ్రోపోనిక్ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో ట్రైల్‌బ్లేజర్‌గా ఉద్భవించిన లెమన్ చిల్లీ ఫామ్స్, డచ్ గ్రీన్‌హౌస్ డెల్టా, కొప్పెర్ట్, వాన్ డెర్ హోవెన్ హార్టికల్చరల్ ప్రాజెక్ట్స్, హూగెన్‌డోర్న్, మెటోర్ సిస్టమ్స్, లూమిఫోర్టే, ప్రైవా, బ్రూక్‌మాన్ లాజిస్టిక్స్, రిడర్, డి రూయిటర్ (బేయర్), డచ్ ప్రభుత్వం మద్దతు అందిస్తున్న విస్కాన్ సహా ‘NLHortiRoad2India’ క్లస్టర్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది.

డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే సమక్షంలో, లెమన్ చిల్లీ వ్యవస్థాపకుడు జనార్దన్ రావు యలమంచిలి, డచ్ గ్రీన్హౌస్ డెల్టా, NLHortiRoad2India ట్రాక్ లీడర్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దేశ్ రామ్‌నాథ్‌ ఈ అవగాహన ఒప్పందం(MOU) పై సంతకం చేశారు. ఈ డైనమిక్ భాగస్వామ్యం ద్వారా, భారతదేశ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన, లాభదాయకమైన ఆహార ఉత్పత్తి వ్యవస్థను రూపొందించడానికి రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయి.

లెమన్ చిల్లీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రితీష్ బాబు వెల్కూర్ మాట్లాడుతూ.. “ఈ సహకారం భారతదేశ వ్యవసాయ రంగాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది. మన దేశానికి పచ్చదనం, ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన భవిష్యత్తును పెంపొందించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. దేశ్ రామ్‌నాథ్ అంకితభావం, నైపుణ్యం ఈ పరివర్తనాత్మక కార్యక్రమాన్ని ఫలవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాయి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News