Wednesday, November 6, 2024

డచ్ గ్రీన్‌హౌస్ డెల్టాతో లెమన్ చిల్లీ ఫామ్స్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశ ఆహార ఉత్పత్తిలో వినూత్న భాగస్వామ్యం కోసం డచ్ గ్రీన్‌హౌస్ డెల్టాతో లెమన్ చిల్లీ ఫామ్స్ చేతులు కలిపింది. పర్యావరణ అనుకూల హైడ్రోపోనిక్ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో ట్రైల్ బ్లేజర్‌గా లెమన్ చిల్లీ ఫామ్స్ ఏర్పాటైంది. డచ్ గ్రీన్‌హౌస్ డెల్టా డచ్ ప్రభుత్వం మద్దతు అందిస్తున్న విస్కాన్ సహా ‘ఎన్‌ఎల్ హార్టి రోడ్2 ఇండియా’ క్లస్టర్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే సమక్షంలో లెమన్ చిల్లీ వ్యవస్థాపకుడు జనార్దన్ రావు యలమంచిలి, డచ్ గ్రీన్హౌస్ డెల్టా, ఎన్‌ఎల్ హార్టి రోడ్2 ఇండియా ట్రాక్ లీడర్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దేశ్ రామ్‌నాథ్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. లెమన్ చిల్లీ ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ రితీష్ బాబు వెల్కూర్ మాట్లాడుతూ, ఈ సహకారం భారతదేశ వ్యవసాయ రంగాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News