Monday, November 25, 2024

లెనెవో కొత్త ల్యాప్‌టాప్‌ విడుదల..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అంతర్జాతీయంగా సాంకేతిక అగ్రగామి సంస్థ లెనెవో, నేడు దేశంలో మొట్టమొదటి సారిగా అత్యాధునిక 13వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్స్‌తో తీర్చిదిద్దిన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ప్రీమియం లెనెవో యోగా 9ఐను వైవిధ్యత కోసం తీర్చిదిద్దారు. దీనిలో ఇంటెల్‌ యొక్క అత్యాధునిక ప్రాసెసర్లు ఉన్నాయి. ఇది హైబ్రిడ్‌ ఆర్కిటెక్చర్‌ పనితీరుపై ఆధారపడి అత్యంత ఆకర్షణీయమైన పనితీరును అందిస్తుంది. ఇంటెల్‌ ఇవో ప్లాట్‌ఫామ్‌ తో కూడిన ఈ ల్యాప్‌టాప్‌, ప్రీమియం మొబైల్‌ అనుభవాలను సృజనాత్మకంగా అందించేలా తీర్చిదిద్దారు. అదే సమయంలో ఇది సిస్టమ్‌ బ్యాటరీ లైఫ్‌, స్పందన లేదా కనెక్టివిటీ పై ప్రభావాన్ని ఇది తగ్గిస్తుంది.

ఆకర్షణీయమైన డిజైన్‌, సాటి లేని వినోదం

అతి సన్నటి, తేలికపాటి కన్వర్టబల్‌ ల్యాప్‌టాప్‌ లెనెవో యోగా 9ఐ. దీనిని సౌకర్యం కోసం అత్యంత ఆకర్షణీయంగా డిజైన్‌ చేశారు. గుండ్రటి ఆకృతిలో ఫినీష్‌, మరింత అనుకూలమైన గ్రిప్‌ను కలిగి ఉంటుంది. దీనిలో 14 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ ఓఎల్‌ఈడీ ప్యూర్‌ సైట్‌ డిస్‌ప్లే మరియు డాల్బీ విజన్‌ను 4కె రిజల్యూషన్‌తో కలిగి అత్యుత్తమ వీక్షణ అనుభవాలను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లోని ఆడియోకు బోవర్స్‌ అండ్‌ వికిన్స్‌ స్పీకర్లు తగిన శక్తిని అందిస్తాయి. దీనిలో డాల్బీ అట్మాస్‌, 360 డిగ్రీ రొటేటింగ్‌ సౌండ్‌బార్‌పై ఉండటం వల్ల వినియోగదారులను ఆకర్ఫిస్తుంది.

అత్యంత సహజసిద్ధమైన తెలివితేటలు, భద్రత

యోగా 9ఐలో ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలో స్మార్ట్‌ ఫేషియల్‌ రికగ్నైషన్‌తో అత్యంత సహజసిద్ధంగా ఉంటుంది. ఇది అత్యంత వేగవంతంగా, సులభమైన, సురక్షిత ప్రాప్యతను అనుమతిస్తుంది. అదే సమయంలో దీనిలోని ప్రైవసీ షట్టర్‌, వెబ్‌క్యామ్‌ను భౌతికంగా మూసివేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీనిలో 28 వాట్‌ ధర్మల్‌ డిజైన్‌ పవర్‌ ఉంది. స్మార్ట్‌ పవర్‌ శక్తితో కూడి ఉండటం వల్ల బ్యాటరీ లైఫ్‌ మరింత మెరుగుపడి సిస్టమ్‌ చల్లగా, నిశ్శబ్దంగా ఉండేందుకు సైతం తోడ్పడుతుంది.

స్మార్ట్‌ సేవలు

లెనోవో వాంటేజ్‌ లోపలి లెనోవో స్మార్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ సేవలు సిస్టమ్‌ను కోరుకున్న పనితీరుతో నడుపుతుంది మరియు పీసీ పనితీరు, ఇంటర్నెట్‌ పనితీరుపై ప్రభావం చూపే అంశాలను చురుగ్గా సరిచేయడంతో పాటుగా మాల్‌ వేర్‌ తొలగించడం, డివైజ్‌ భద్రతను మెరుగుపరచడం కూడా చేస్తుంది. లెనోవో ప్రీమియం కేర్‌ ప్లస్‌, వ్యక్తిగతీకరించిన హార్డ్‌వేర్‌ మరియు సాఫ్ట్‌వేర్‌ మద్దతును ఎలైట్‌ టెక్నీషియన్ల గ్లోబల్‌ నెట్‌వర్క్‌ మద్దతుతో అందిస్తుంది. దీనిలో యాక్సిడెంటల్‌ డ్యామేజీ ప్రొటెక్షన్‌, డాటా మైగ్రేషన్‌ అసిస్టెన్స్‌, స్మార్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ సొల్యూషన్స్‌ ఉండి పీసీ పనితీరు, భద్రతను మెరుగుపరుస్తాయి.

లెనోవో ఇండియా కన్స్యూమర్‌ బిజినెస్‌– డైరెక్టర్‌ దినేష్‌ నాయర్‌ మాట్లాడుతూ. ‘‘ఇంటెల్‌ యొక్క 13వ తరపు భావితరపు కంప్యూటింగ్‌ ప్రాసెసర్‌ ఆధారిత ల్యాప్‌టాప్‌లను భారతీయ మార్కెట్‌లో విడుదల చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా యోగా శ్రేణి ఉపకరణాలు అత్యుత్తమ శ్రేణిలో ఉండటంతో పాటుగా వినియోగదారుల స్మార్ట్‌ ఎంపికలకు, వారి విస్తృత శ్రేణి ఉత్పాదక అవసరాలకు మద్దతు అందిస్తాయి.

మేము ఈ సంప్రదాయం మా నూతన, తాజా యోగా 9ఐతో కొనసాగిస్తున్నాము, దీనిలో తాజా ఇంటెల్‌ ప్రాసెసర్లు ఉన్నాయి. ఈ 2–ఇన్‌–1 ల్యాప్‌టాప్‌ బహుముఖ జీవనశైలి కలిగిన వ్యక్తులకు ఉత్తమంగా ఉండటంతో పాటుగా సాంకేతికతపై ఆధారపడే వ్యక్తులకు సరైనది. ఇది వారికి తెలివిగా, సౌకర్యవంతంగా, సమర్ధవంతంగా పనులను చేయగలదు’’ అని అన్నారు.

యోగా 9ఐ ఓట్‌మీల్‌ రంగుతో వస్తుంది, వినియోగదారులు దీనిని లెనొవో డాట్‌ కామ్‌ ద్వారా ముందుగా బుక్‌ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర 1,74,990 రూపాయలు. ఈ ల్యాప్‌టాప్‌ లు లెనొవో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్‌, అమెజాన్‌ డాట్‌ ఇన్‌, క్రోమా, రిలయన్స్‌ లో జనవరి 29 నుంచి లభించనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News