Sunday, January 19, 2025

ఐర్లాండ్ ప్రధానిగా మరోసారి భారత సంతతి వ్యక్తి

- Advertisement -
- Advertisement -

డబ్లిన్:   ఐర్లాండ్ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి లియో ఎరిక్ వరద్కర్ రెండోసారి ఎన్నికయ్యారు. 43 ఏళ్ల లియో ఇది వరకే ఒకసారి ఐర్లాండ్ ను పాలించారు.  ఇప్పటికీ ఐర్లాండ్ ను పాలిస్తున్న పిన్న వయస్కుడిగా ఉన్నారు. 38 ఏళ్ల వయసులో 2017లో ఆయన తొలిసారి ప్రధాన మంత్రి అయ్యారు.

2022లో ఐర్లాండ్ లోని ప్రధాన పార్టీలైన ఫిల్ గేన్, మార్టిన్ ఫియన్నా ఫెయిల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు లియోకు మరోసారి అవకాశం లభించింది. కాగా, లియోకు భారత ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. ‘రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లియోకు అభినందనలు. ఐర్లాండ్ తో మా చారిత్రక సంబంధాలు, రాజ్యాంగ విలువలను పంచుకోవడం, బహుముఖ సహకారానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాము’ అని ట్వీట్ చేశారు. ఇరు దేశాల అర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయనతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News