Friday, December 27, 2024

వాచ్ టవర్ వద్ద చిరుత సందడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లి గ్రామంలోని కెసిఆర్ అర్బన్ పార్క్ గోల్ బంగ్లా వాచ్ టవర్ దగ్గర చిరుత సందడి చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ మానసపుత్రిక హరితహారంలో భాగంగా ఈ పార్కును అభివృద్ధి చేశారు.

పచ్చదనం పర్చుకున్న ఈ వనంలో చిరుత కనిపించడం.. అద్భుతమైన ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్ చేశారు. తెలంగాణ అంతటా పచ్చదనాన్ని పెంచాలనే మన ముఖ్యమంత్రి సంకల్పానికి వందనం అని పలువురు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News