Wednesday, January 22, 2025

చిరుత దాడిలో 52 గొర్రెలు, నాలుగు మేకలు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: చిరుత పులి దాడిలో 52 గొర్రెలు, నాలుగు మేకలు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లాలో జరిగింది. బిల్ని గ్రామంలో ముబసిర్ హుస్సేన్ అనే వ్యక్తి గొర్లు కాపరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. టికియా గ్రామంలో రెండు రోజుల వ్యవధిలో నాలుగు మేకలు, 52 గొర్రెలుపై చిరుత పులి దాడి చేయడంతో అవి మృతి చెందాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించాడు. స్థానికంగా కెమెరాలు, బోనులను అధికారులు ఏర్పాటు చేశారు. చిరుతల భారీ నుంచి తమతో పాటు పశువులను, మేకలు, గొర్రెలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News