Thursday, January 16, 2025

మహిళపై చిరుత దాడి

- Advertisement -
- Advertisement -

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/బజార్‌హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హత్నూర్ మండలం, డేడ్రా గ్రామంలోని ఒక మహిళపై చిరుత పులి దాడి చేసింది. గ్రామానికి చెందిన అర్క భీంబాయి శనివారం ఉదయం 5 గంటల సమయంలో గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్తున్న క్రమంలో చిరుతపులి దాడి చేసిందని స్థానికులు తెలిపారు. ఆమె ముఖంపై కుడి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆటోలో ఆమెను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. ఎఫ్‌బిఓ తిరుపతి ఆరోగ్య కేంద్రానికి చేరుకొని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. బాధితురాలికి అటవీ శాఖ నుండి తక్షణ సహాయం కింద రూ.10వేల ఆర్థిక సహాయం చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఓ ప్రవీణ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News