Sunday, January 19, 2025

శ్రీశైలంలో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఎఇఒ ఇంటి వద్ద కుక్కను చిరుత ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో కనిపించడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి ప్రహరీ గోడ పైనుంచి వచ్చి కుక్కను ఎత్తుకెళ్లినట్టు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత బంధించడానికి బోన్లను ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News