Sunday, January 19, 2025

కృష్ణా జిల్లాలో చిరుత మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో చిరుతపుల్లి మృతి చెందింది. మెట్లపల్లిలో గ్రామంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందింది. నెల రోజుల గన్నవరం మండలంలో చిరుత సంచరిస్తుందని రైతులకు సమాచారం ఇచ్చారు. ఓ రైతు పట్టించుకోకుండా పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి ఉచ్చులు ఏర్పాటు చేశాడు. ఆ ఉచ్చులలో చిక్కుకొని చిరుత మృతి చెందింది. మెట్లపల్లి గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ, పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News