Sunday, January 19, 2025

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి..

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ జిల్లా ముసాబ్‌పేట మండలం పోల్కంపల్లి స్టేజి వద్ద రాత్రి జాతీయ రహదారి 44 పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుత మృతి చెందింది. రోడ్డుకు దిగువన మృతి చెందిన చిరుతను స్దానకులు ఉదయం గుర్తించారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లిన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. అయితే చిరుతకు ఎలాంటి రక్తపు గాయాలు లేక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిజంగా ప్రమాదమా లేక ఎవరైనా చిరుతను చంపేశారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి.

ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా చుట్టూ అటవీ ప్రాంతం, కొండలు, గుట్టలు ఉండడంతో చిరుతల సంచారం అధికంగా ఉంది. ఆహారం కోసం అటవీ ప్రాంతాల నుంచి బయటికి వస్తున్న చిరుతలను ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News