Friday, November 22, 2024

కరెంట్ షాక్ తో చిరుత మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆలుగడ్డ చేను చుట్టు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు తగిలి చిరుతపులి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరౌలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధర్మాపాల్ అనే రైతు జంతువుల నుంచి తన పంటను రక్షించుకోవడం కోసం ఆలుగడ్డ చేను చుట్టు విద్యుత్ తీగతో కంచెను ఏర్పాటు చేశాడు. రాత్రి సమయంలో చిరుతపులి ఆ ప్రాంతంలోకి రావడంతో కరెంట్ షాక్‌తో చిరుత చనిపోయింది. గ్రామస్థుల ఇచ్చిన సమాచారం మేరకు అలీగఢ్ అటవీ అధికారి అదితి శర్మ అక్కడికి చేరుకొని జంతు సంరక్షణ చట్ట ప్రకారం 9, 50, 51 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిరుత కళేబరం నుంచి పళ్లు, గోర్లు, తోక ఎక్కడ తొలగించలేదన్నాడు. పరీక్షల నిమిత్తం చిరుత కళేబరాన్ని ఐవిఆర్‌ఐ బరేలీకి పంపించామన్నాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News