Thursday, January 23, 2025

ఢిల్లీ వజీరాబాద్‌లో చిరుత అలజడి

- Advertisement -
- Advertisement -

ఉత్తర ఢిల్లీ వజీరాబాద్‌లోని గ్రామంలో సోమవారం ఒక ఇంట్లోకి చిరుత చొరబడి అలజడి సృష్టించింది. ఐదుగురిని గాయపర్చిం ది. జగత్‌పూర గ్రామంలో ఒక ఇంటిపై కప్పు నుంచి పక్కనున్న భవనం లోకి చిరుత దుమికిన తరువాత గదిలో బంధించి తాళం వేశారు.. చిరుతను పట్టుకోడానికి గ్రామ ప్రజలు వెంటాడి పరుగులు తీయడం ఇదంతా వీడియో వైరల్ అయింది. చిరుత గురించి ఉదయం 6.20 గంటలకు సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బందిని అక్కడకు పంపామని,

స్థానికుల సహకారంతో చిరుతను ఒక గదిలో బంధించి తాళం వేసారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ వివరించారు. మొదట సోమవారం తెల్లవారు జామున 4.30 గంటలకు చిరుత జాడను గమనించి, వెంటనే 5.15 గంటలకు అధికారులకు ఫోన్ చేశామని స్థానికుడు ఒకరు తెలిపారు. గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి పంపించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంకె మీనా చెప్పారు. స్థానిక పోలీస్‌లతోపాటు అటవీ, అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రదేశంలో పర్యవేక్షణలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News