Sunday, January 5, 2025

ఆస్పత్రిలోనికి వచ్చిన చిరుత…

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ ఆస్పత్రిలోకి వెళ్లిన చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం శహాదా పట్టణంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. శహాదా పట్టణంలోని డోంగర్ రోడ్డులో నడిబొడ్డున ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చిరుత పులి ప్రవేశించింది. జనరేటరు ఉన్న గదిలో చిరుత వెళ్లగానే ఆస్పత్రి సిబ్బంది అన్ని రూముల డోర్లను మూసి వేసి అటవీ శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిరుత ఉందని శహాదా పట్టణ వ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. జనం అరుపుల మధ్య చిరుతను పట్టుకోవడం అటవీ శాఖ సిబ్బందికి సవాలుగా మారింది. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News