Sunday, January 19, 2025

శంషాబాద్ లో మళ్లీ చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియాగూడలో రెండు రోజుల క్రితం చిరుత కనిపించడంతో పట్టుకునేందకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం చిరుత సంచరించిదని అనవాళ్లు కనిపించడంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో  కనిపించిన జంతువు చిరుతగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడంతో 3 బోన్లు, 10 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక బోన్‌లో చిరుత కోసం కుక్కను ఎరగా అధికారులు పెట్టారు. చిరుత పులి సంచరించడంతో శంషాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.  నెల రోజుల క్రితం శంషాబాద్‌లోని విమానాశ్రయ ప్రాంతంలో చిరుతో పాటు రెండు పిల్లలను అటవీ శాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News