Friday, January 17, 2025

తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం

- Advertisement -
- Advertisement -

శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు చిరుతపలి కనిపించడం కలకలం రేపుతోంది. తిరుమలలో మరోసారి చిరుతలు సంచ రిస్తున్నట్లు గుర్తించారు. అలిపిరి నడకదారిలో సోమవారం మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి పారిపోయినట్లు సమాచారం. భక్తుల నుంచి సమచారం అందుకున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీ లిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది చిరుతల జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగింది. చిరుత సంచారం విషయం తెలియగానే భక్తులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. టిటిడి సిబ్బంది సైతం నడక దారి భక్తులను దర్శనానినికి గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.

కాగా తిరుమల కొండపై కొద్ది రోజుల క్రితమే చిరుత సంచరించింది. ఈ నెల 15వ తేదీన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో చిరుత కనిపిం చింది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. సిసిటివి కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతను చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చిరుత రోడ్డును దాటుకొని వెళ్లిపోవడంతో భక్తులు పీల్చుకున్నారు. గతంలో కూడా తిరుమలలో పలుమార్లు చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురి చేసింది. తాజాగా మరోసారి తిరుమలలో రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News