- Advertisement -
జిల్లాలోని సదాశివనగర్ మండలం, నిజామాబాద్ సరిహద్దు సమీపంలో మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. జాతీయ రహదారిపై వాహనం ఢీకొట్టడంతో కొద్దిసేపు రోడ్డుపై ఉన్న చిరుత ఫొటోను వాహనదారులు సెల్‌ఫోన్ల ద్వారా తీసి పలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కొద్దిసేపు రహదారిపై ఉన్న చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది చిరుత సంచారం ప్రచారం చేయడంతో సమీప గ్రామాలలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమీప గ్రామాల్లోకి చిరుత రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
- Advertisement -