సియోని ( ఎంపి ) : మధ్యప్రదేశ్ సియోని జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం తండ్రి ఎదుటే 16 ఏళ్ల బాలికపై చిరుతపులి దాడి చేసి ప్రాణాలు బలిగొంది. పండివాడ గ్రామం సమీపాన కన్హవాడ అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని ఫారెస్టు రేంజర్ యోగేష్ పటేల్ చెప్పారు. బాలిక రవీనా యాదవ్ తన తండ్రితో కలసి అడవిలో పశువులను కాయడానికి వెళ్లింది. 8 కిమీ లోపల గాఢమైన అడవి లోకి ప్రవేశించగానే చిరుత వెనుకనుంచి బాలికపై దాడి చేసి మెడ కరిచి పట్టుకుంది. కుమార్తెను రక్షించడానికి తండ్రి ఎంత ప్రయత్నించినా కర్రతో చిరుతను కొట్టినా ఫలితం లేక పోయింది. తండ్రిపై కూడా దాడి చేసింది.ఈ లోగా దగ్గరలో ఉన్న కొంతమంది అక్కడకు రాగాగే అది బాలిక శవాన్ని విడిచిపెట్టి అడవి లోకి పారిపోయింది. అటవీశాఖ తక్షణ సహాయంగా రూ. 10 వేలు బాలిక తండ్రికి అందచేశారు. ఎక్స్‌గ్రేషియా రూ. 4 లక్షలు త్వరలో ఆ కుటుంబానికి అందుతుందని అటవీ శాఖ అధికారి తెలిపారు. ఆ చిరుతను పట్టుకోడానికి అక్కడ ఒక బోను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తండ్రి ఎదుటే బాలికను బలిగొన్న చిరుత
- Advertisement -
- Advertisement -
- Advertisement -